కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించండి..

మాచినేనిపేట తండా, జూలూరుపాడు, ఆంధ్రప్రభ: పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తే మాచినెనిపేట తండా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లకావత్ జానకి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, జానకి గ్రామస్తులకు బ్యాట్ గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
జానకి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధి కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం, సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేసి మద్దతు ఇవ్వాలని జానకి గ్రామస్తులను కోరారు.
