బీజేపీ-టీవీకే పొత్తు పైనల్…!

బీజేపీ-టీవీకే పొత్తు పైనల్…!

  • టీవీకేకి ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్..?
  • అసంతృప్తిలో టీవీకే పార్టీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి- టివికె సీట్ల పంపకాల చర్చలు చివరి దశకు చేరినట్లు సమాచారం. టివికె కు 80 సీట్లు, డిప్యూటీ సిఎం పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం కూటమి ఎన్నికల్లో విజయం సాదిస్తే విజయ్ కి ముఖ్యమంత్రి పదవిని  ఆఫర్ చేసినట్లు సమాచారం. కాని టివికె వర్గాలు మాత్రం విజయ్ ముఖ్యమంత్రి పదవిపై దృష్టి సారించారని తెలిపారు. ఒక వెల సీట్ల సర్దుబాటు అయితే తమిళనాడు ఎన్నికల లెక్కలు మారవచ్చు.


అదే సమయంలో బీజేపీ పొత్తుపై విజయ్ పార్టీలో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. కొత్తగా ప్రారంభించిన పార్టీ రాజకీయ వేదిక కావాలి కానీ పొత్తు వల్ల పార్టీ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని పార్టీలో కొందరు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Leave a Reply