ఖానాపూర్‌లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ..

కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఖానాపూర్‌కు విచ్చేసే సందర్భంగా జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఖానాపూర్ కొమరం భీం చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మండల కేంద్రం కడెం నుంచి బైక్ ర్యాలీగా ఖానాపూర్ పట్టణానికి తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, కడెం మండల ప్రధాన కార్యదర్శి పి. శ్రీరామ్, రాపర్తి శ్రీనివాస్, మండల నాయకులు జక్కుల సత్తన్న, కళ్లెం రమణారెడ్డి, డి. తిరుమలయ్య, రవీందర్ గౌడ్, ప్రసాద్, నల్లగొండ ప్రవీణ్, ములికి కృష్ణ, రాపల్లి కొండయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
