BJP ఆంధ్రప్రభ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) జరగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ పూర్తవగా.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 66.91 శాతం పోలింగ్ నమోదైంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉన్నట్లు తేలడంతో, బీజేపీ శిబిరం ఇప్పటికే విజయోత్సాహంలో మునిగిపోయినట్టుగా కనిపిస్తోంది.

బీహార్ లో అన్ని పండుగలు ఒకే రోజు
ఈ ఎన్నికల్లో విజయం తమదేనన్న నమ్మకంతో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఓట్ల లెక్కింపు రోజును పండుగలా చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ నాయకులు ముందుగానే భారీగా లడ్డూలను ఆర్డర్ చేశారు.
ప్రజలకు ప్రసాదంగా పంపిణీ చేసేందుకు 501 కిలోల లడ్డూలను ఆర్డర్ చేశామని బీజేపీ కార్యకర్త కృష్ణకుమార్ కల్లు తెలిపారు. ప్రజలు అభివృద్ధి పనులకే ఓటు వేశారు. అందుకే ఓట్ల లెక్కింపు రోజు ఎన్డీఏకు హోళీ, దసరా, దీపావళి, ఈద్ పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లుగా ఉంటుంది అని ఆయన అన్నారు.

