BJP Rule | ఢిల్లీలో కొత్త మార్పు .. చంద్రబాబు
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నామని చెప్పారు. ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు దేశ రాజధానిలో కొత్త శకం మొదలైందని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి ఇకపై అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం జరగబోతుందని వెల్లడించారు.