BJP | ఇక సౌత్ పై ఫోకస్

BJP | ఇక సౌత్ పై ఫోకస్
BJP | భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బీహార్ విజయంతో ఇక సౌత్ పై ఫోకస్ పెట్టనున్నట్లు కనిపిస్తోంది.
BJP | ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్: అంచనాలకు అందని విజయంతో బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, తదుపరి ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి సారించడం ద్వారా అన్ని చోట్లా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలపై ఈ దఫా పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని, ఆ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారం లో ఉన్న మహా కుటమిలో ఆ పార్టీ భాగస్వామిగా ఉండటంతో, మిగతా రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయినప్పటికీ, బీజేపీ ఎత్తుగడ ఫలించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఒక్క సీట్ కోసం పోటీ చేయలేదని, బలమైన ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహంతో ముందుకు సాగిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నిక ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన నేపథ్యంలోనే అంతగా ప్రచారం పైనా, పోల్ మేనేజ్మెంట్ పైనా ఆ పార్టీ నేతలు దృష్టి సారించలేదని జనం లేదని భావించిన నేపథ్యంలోనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక సౌత్ రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పాటు, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ ప్రణాళికలు రచిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.
BJP | భవిష్యత్ కోసం బీజేపీ యత్నం
2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో బలమైన పార్టీగా అవతరించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అక్కడ రాజకీయ పరిస్థితులను గమనంలో ఉంచుకొని టీవీకే వంటి నూతనంగా ఏర్పడిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్నికల బరిలో నిలవాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
మరో వైపు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వర్గ విబేధాలు, ఆధిపత్య పోరును అవకాశంగా మలుచుకొని, ధీటైన ప్రత్యర్థిగా రాణించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని అనైక్యతను ఆసరా చేసుకొని, కర్ణాటకలో లబ్ది పొందాలనే వ్యూహం తో అక్కడ బీజేపీ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన తెలంగాణలోనూ బీఆర్ఎస్ పార్టీని రూపు మాపడం ద్వారా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కోవాలన్నది బీజేపీ వ్యూహం గా కనిపిస్తోంది. ఈ లోగా బీఆర్ఎస్ నుంచి సాధ్యమైనంత మంది అసమ్మతి నాయకులను పార్టీలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపి స్తోంది. బీఆర్ఎస్ ఒక్కో నియోజకవర్గంలో ఇరువురికి పైగా ఆశావహులున్న చోట నుంచి భారీగా పార్టీలోకి తీసుకొనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది.
BJP |జూబ్లీ ఓటమి వ్యూహాత్మకమే.!
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవరైనా ఒక్కరే మిగులుతారని, ఆ మిగిలిన పార్టీతో నేరుగా యుద్ధంలోకి దిగాలన్న లక్ష్యంతోనే ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు రాజకీయ విశ్లేష కులు అంచనా వేస్తున్నారు. జూబ్లీ గాయంతో బీఆర్ఎస్ నుంచి అనుసమ్మతిని అక్కున చేర్చుకోవడం ద్వారా 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బలంగా వెళ్లాలనే వ్యూహం దాగి
ఉన్నదని, అంతేకాకుండా దాదాపు సగం ఎంపీ సీట్లను గెలుచు కోవడం ద్వారా ఆ పార్టీ పాగా వేసిందని, ఆయా స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలపై ఫోకస్ పెడితే ఆ పార్టీకి మంచి ఫలితాలు వ స్తాయని వారు పేర్కొంటున్నారు. వ్యూహాత్మకంగానే కొన్ని ఎన్ని కలను ఆ పార్టీ లైట్ తీసుకుంటోందని, బలమైన ప్రత్యర్థుల్లో ఒకరిని తుదముట్టించడం ద్వారా ఆ స్థానంలో తాను ఎదగాలన్నది బీజేపీ ఎత్తుగడని వారు పేర్కొంటున్నారు.
