BJP | ముస్లింల మెప్పుకోసం బిసిల కులగణన – బీజేపీ ఎంపీ లక్ష్మణ్

నిజామాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 16:(ఆంధ్రప్రభ) ముస్లింల మెప్పు కోసమే కాంగ్రెస్ సర్కార్ కుల గణ న చేపట్టారని ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుదు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కుల గణన వివ రాలను బహిర్గతం చేయా ల్సింది పోయి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ రీ సర్వే చేస్తున్నారని మండి పడ్డా రు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్ష తన ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. ముస్లిం బిసి అంటూ కులగణలలో కొత్త పదం చేర్చడం బీసీ రిజర్వేషన్లలో కోత విధిం చడమేనని ఆగ్రహాం వ్య క్తం చేశారు.

కులాల మధ్య చిచ్చుపెట్టి కుల రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. బీసీల జాబితాలోకి ముస్లింలను చేర్చి బీసీల హక్కులను కాలరాస్తున్నారని మండి పడ్డారు.

కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన 8 వేల కోట్ల ఫీజు రీయంబ ర్స్మెం ట్ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని ధ్వజ మెత్తారు. ఉద్యోగాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభు త్వం నిరుద్యో గులను మోసం చేసిందన్నారు. అదేవిధంగా రేవంత్ సర్కార్ ఎన్నికల్లో అమ లు కానీ హామీలను ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువై ఎరువు తెచ్చుకు న్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్ర రాజకీ యాల్లో మలుపు కాబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు

.హైడ్రా మతం ఏమిటి?

ప్రపంచానికే దిక్సూచి అయిన మోదీ కులం పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. అసలు హైడ్రా మతం ఏమిటో.. ఓల్డ్ సిటీలో హైడ్రా అడు గు పెడతాదా అని ప్రశ్నిం చారు. పాతబస్తీలో కరెం టు బిల్లులు కూడా వసూ లు చేయలేని దద్దమ్మలని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపీ ధర్మపురి అరవింద్ సంచ లన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలను, రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల ను పక్క దోవ పట్టించడానికే రేవంత్ సర్కార్ మోదీ కులం ప్రస్తావన చేస్తున్నా రని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పూల గణనన చేసిన రేవంత్ తెలంగాణ రాష్ట్రా నికి మైనార్టీల నుంచి ఎంత ఆదాయం వస్తుం ది..

హిందువుల నుంచి ఎంత ఆదాయం వస్తుందో రేవంత్ సర్కార్ చెప్పా లని ప్రశ్నించారు. కులాల పేరుతో కుల రాజకీయాలు చేయొద్దని రేవంత్ సర్కార్ కు సూచించారు.

ఈ సమావే శంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల రామచంద్ర రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *