BJP | స్ఫూర్తిదాయకం.. వందేమాతరం గీతం

బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు

BJP |జుక్కల్ (కామారెడ్డి) : వందేమాతర గీతం స్ఫూర్తిదాయకమని, పోరాట స్ఫూర్తిగా నిలిచిందని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు కొనియాడారు. వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం నాడు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండల కేంద్రంలో గల శ్రీ సాయి విద్యానికేతన్‌లో విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

ఈ మహోన్నతమైన గీతాన్ని ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర చటర్జీ(చాటో పాధ్యాయ) 1875 సంవత్సరం లో రచించడం జరిగిందని,ఈ లక్షలది భారతీయులను ఏకతాటిపై తీసుకువచ్చిన ఘనత ఈ గేయానికి దక్కిందన్నారు. భారత ప్రభుత్వం ఈగేయాన్ని జాతీయ గీతంగా ఆమోదించటం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, బీజేపీ జుక్కల్ మండల అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి వినోద్ గౌడ్, సీనియర్ నాయకులు శివాజీ రావు పాటిల్, బసవంత్ రావు, నాయకులు గంగాధర్, మారుతి, పాకలి పావన్, గోరఖ్నాథ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply