దేశం కోసం, ధర్మం కోసం బి జే పి

మంచిర్యాల అభివృద్ధికి ఓటు వేయండి
51 డివిజన్ బిజెపి అభ్యర్థి నల్లపు రజిత రమేష్
మంచిర్యాల ఆంధ్రప్రభ : దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లయితే మంచిర్యాల కార్పొరేషన్లోని 51 డివిజన్ అభివృద్ధి చేసేందుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి అని నల్లపు రజిత రమేష్ దంపతులు శనివారం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.గత దశాబ్ద కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధి చెందాలంటే ఒకసారి బిజెపికి అవకాశం ఇచ్చేందుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు.
