నాద్యేయం వార్డు ప్రజల సంక్షేమమే

నాద్యేయం వార్డు ప్రజల సంక్షేమమే

10 వ వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి శాంతరాణి

చెన్నూర్ ఫిబ్రవరి 9(ఆంధ్రప్రభ ) వార్డు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి కష్ట సుఖలో తమవెంటే ఉంటు సేవలు అందించి ఉద్దేశ్యం తో మీ ఆడపడుచుగా మీముందుకు వస్తున్నాని చెన్నూరు మున్సిపల్ 10వ వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి శాంతరాణి వెంకట నర్సయ్య అన్నారు. ఎన్నికల ప్రచారా ముగింపు సందర్బంగా 10వ వార్డులో భారీర్యాలీతో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతరాణి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధిగా గత అనుభవంతో వార్డు అభివృద్ధి, వార్డులో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ దీపాలు, సైడ్ డ్రైనేజిలు పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించి చూపిస్తానని ప్రజలు ఆడపడుచుగా ఆదరించి కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు.

Leave a Reply