ఘనంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య జన్మదిన వేడుకలు

నినాదాలతో మార్మోగిన బీఆర్ఎస్ కార్యాలయం
కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే
త్యాగం చేసిన నేతకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

స్టేషన్ ఘన్ పూర్ ,ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా లయంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.


కార్యాలయం పరిసర ప్రాంతం నినాదాలతో మార్మోగింది. అభిమానులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ..స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నాయకులను తీర్చిదిద్దే నాయకుడిగా డా. రాజయ్య ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. కార్యకర్త స్థాయి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎదగడానికి ఆయన ప్రోత్సాహం, మార్గదర్శనం కీలకమని పేర్కొన్నారు. రాజకీయంగా త్యాగం చేసిన నేతగా, ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పార్టీ శ్రేణులు సంకల్పించాయి.

ఈ సందర్భంగా డా. రాజయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య క్రమంలో బిఆర్ ఎస్ నాయకులు తాటికొండ సురేష్ కుమార్, కనకం గణేష్, చందర్ రెడ్డి, రాజన్ బాబు, కౌన్సిలర్ లు తాటికొండ మధు, చల్లా రమ్య రఘు రెడ్డి, పొన్న రాజేష్, బూర్ల రాజేశ్వర్, బాలగాని అనిల్, యూత్ నాయకులు మారేపల్లి ప్రసాద్ బాబు, గుండె మల్లేష్, ఆకారప్ అశోక్, జోగు వినయ్ కుమార్,కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply