Birthday | మళ్లీ వస్తాం…

Birthday | మళ్లీ వస్తాం…
- ఎందుకు ఓడించామా అని ప్రజలే బాధపడుతున్నారు
- పత్తిపాడు ఇంచార్జి బలసాని
- జగన్ బర్త్‌డే వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు
Birthday | పత్తిపాడు, ఆంధ్రప్రభ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను పత్తిపాడు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పత్తిపాడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన పత్తిపాడు ఇంచార్జి కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “జగన్‌ను ఎందుకు ఓడించామా అని ఈ రోజు ప్రజలే బాధపడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అప్పుల మోత మోగిస్తూ ప్రజలపై భారాన్ని మోపుతోంది. వైఎస్ఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు నేడు ప్రజలకు గుర్తొస్తున్నాయి” అని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ పాలన సాగిందని, పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చిన నాయకుడు జగన్ మాత్రమేనని కిరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే వైఎస్ఆర్ సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించగా, పార్టీ శ్రేణులు “జగన్ అన్నా… మళ్లీ వస్తాం” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును చాటుకున్నారు.
