Bill Gates Fida :   బిల్​ గేట్స్​ ఫిదా Andhra Prabha SPL Story  

Bill Gates Fida :   బిల్​ గేట్స్​ ఫిదా Andhra Prabha SPL Story  

సీఎం సీబీఎన్​ ఖుషీఖుషీ

 క్వాంటం వ్యాలీ పరుగో పరుగు

కూటమి సర్కారు క్రతువు ఫలితం

ఇక అమరావతికి  విశ్వనగరి యోగం

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి)

Bill Gates Fida

అమరావతిలో ఆరంభమైన  డిజిటాల్​ విప్లవ క్రతువుకు   ప్రపంచం ఫిదా అవుతోంది.    క్వాంటం వ్యాలీలో  టెక్​ దిగ్గజాలు దృష్టి సారిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఏపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ యజ్ఞానికి ఆత్మీయ అతిథిగా మైక్రోసాప్​ అధినేత బిల్​ గేట్​ తెలుగింటికి వచ్చారు. యజ్ఞ  యజమాని, ప్రధాన ఋత్వికుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిదేవోభవ అంటూ ఆహ్వానించారు.  ఇక యజ్ఞ మైత్రావరుణుడు డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​, క్రతువు  అచ్ఛావాకుడు ఐటీ మంత్రి నారా లోకేష్​ .. కీలక పాత్ర పోషించారు.  అతిథి బిల్​ గేట్స్​ ( Bill Gates Fida) ను ప్రసన్నం చేశారు. తాము సైతం డిజిటాల్​ విప్లవ సైనికులం అని బిల్​ గేట్స్​ ను ఆకట్టుకున్నారు. ఇక  క్వాంటం వాలీలో ఏపీ ఉజ్వల భవిష్యత్తు శరవేగంతో పరుగులు తీయటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Bill Gates Fida : ఏపీ సీఎం ప్రసన్నార్చన

Bill Gates Fida

 పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) పటిష్టతపై ప్రదర్శనలు ఇచ్చారు.  కుప్పంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని హెల్త్ రికార్డ్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం కోరారు.  డ్రోన్లు ,  ఏఐ సాంకేతికతను వ్యవసాయంలో ఎలా ఉపయోగిస్తున్నారో గేట్స్ స్వయంగా ఉండవల్లిలోని పొలాల్లో పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికను గేట్స్ బృందానికి వివరించారు.  ఏపీని గ్లోబల్ టెక్ హబ్​ గా  మార్చడంలో మైక్రో సాఫ్ట్ ,  గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కోరారు.

Bill Gates Fida : బిల్ గేట్స్​ ఫిదా

Bill Gates Fida

క్వాంటం వ్యాలీలో  మైక్రోసాఫ్ట్  సంస్థ కీలక పాత్ర పోషించటం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతిలో నిర్మించబోతున్న క్వాంటం వ్యాలీలో దాదాపు ₹1,772 కోట్ల ($212 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందు మైక్రోసాఫ్ట్ అంగీకరించినట్టే .  అమరావతిలో 1,200 క్యూబిట్ (qubit) సామర్థ్యంతో భారత్‌లోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్  ఏర్పాటు చేయనుంది.  ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ,  500 మంది ఉపాధ్యాయులకు క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం వాడుతున్న డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలను గేట్స్ ప్రశంసించారు. మొత్తానికి, ఈ పర్యటన ద్వారా ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలను అమరావతికి ఆకర్షించడంలో ఒక ముఖ్యమైన అడుగు వేసినట్లు కనిపిస్తోంది.

Bill Gates Fida : అప్పటికి ఐటీ విప్లవానికి పునాది ఇలా..

Bill Gates Fida

ఔను 29 ఏళ్ల కిందట అప్పటి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​  సీఎం చంద్రబాబు పూరించిన హైటెక్​ విన్లవ శంఖారావం ఫలితం ఇది. ఆయన వేసిన  సైబర్​ సిటీ పునాది ఈ రోజు భాగ్యనగరి యూనివర్స్​ సిటీగా  మారింది.   ప్రస్తుతం హైదరాబాద్‌ లో  1,500  పైగా  ఐటీ ,  ఐటీ ఆధారిత సేవల (ITeS)   కంపెనీలు చేరుకున్నాయి.  హైటెక్ సిటీలోనే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాలు వెలుగులు చిమ్ముతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఐటీ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా సుమారు 11.2 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు.  ఐటీ రంగంతో  హౌసింగ్, రవాణా, హోటల్   ఇతర సేవా రంగాలలో  దాదాపు 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. 2023-.. 24 ఆర్థిక సంవత్సరంలో  ప్రధానంగా హైదరాబాద్  నుంచి ఐటీ ఎగుమతులు ₹2.68 లక్షల కోట్లకు ($32.2 బిలియన్లు) చేరాయి. తాజాగా ఇది ₹3 లక్షల కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా.  హైదరాబాద్ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో  బెంగళూరు తర్వాత  దేశంలోనే రెండవ స్థానంలో కొనసాగుతోంది.

Bill Gates Fida : ఫలించిన  చంద్రన్న   యజ్ఞం

Bill Gates Fida

 1997లో  మైక్రోసాప్ట్​ అధినేత బిల్​ గేట్స్​ మహా బిజీ. ఆయన అపాయింట్​ మెంట్​ దొరకటం మహా యజ్ఞమే. బిల్​ గేట్స్ ను కలిసేందుకు  అప్పటి సీఎం చంద్రబాబు భగీరథయత్నం ప్రారంభించారు. బిల్​గేట్స్​  భారత్ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో  ఎట్టకేలకు చంద్రబాబుకు అపాయింట్​ మెంట్​ లభించింది. అదీ పదినిముషాలే.    అప్పట్లో గేట్స్ బిజీ షెడ్యూల్ వల్ల కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు.  చంద్రబాబు తన వెంట తెచ్చుకున్న ల్యాప్‌టాప్‌లో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  ఉమ్మడి  ఏపీలో   ఐటీ అవకాశాలను వివరించారు. ఆ విజన్ నచ్చడంతో ఆ 10 నిమిషాల సమావేశం కాస్త  45 నిమిషాల పాటు కొనసాగింది.  ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చంద్రబాబు ప్రతిపాదనలు చేశారు:  అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ తన తొలి పరిశోధన ,  అభివృద్ధి (R&D) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. IIIT హైదరాబాద్  స్థాపించబోయే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)కి మైక్రోసాఫ్ట్ మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ సేవల్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఉపయోగించేలా పరస్పర సహకారం కోరారు.  1998లో సీటెల్ (అమెరికా) వెలుపల మైక్రోసాఫ్ట్ తన తొలి  డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.  మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో ఐటీ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. దీని ఫలితంగానే గూగుల్, ఒరాకిల్, ఐబిఎం వంటి ఇతర గ్లోబల్ దిగ్గజాలు కూడా నగరానికి వచ్చాయి.

Bill Gates Fida : తాజాగా   డిజిటాల్​ రివల్యూషన్​  

ఏపీ సీఎం భవిష్య ప్రణాళిక రూటే సెపరేటు. ముప్పై ఏళ్లు కిందట ఐటీ యుగానికి పునాది వేశారు. తాజాగా  నవ ఆంధ్రప్రదేశ్​ ఉజ్వల భవితకు.. డిజిటాల్​  విప్లవానికి రంగం సిద్ధం చేశారు.  అమరావతి రాజధాని ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో  2026  ఫిబ్రవరి 7   (శనివారం)న   ప్రతిష్టాత్మక   అమరావతి క్వాంటం వ్యాలీ (AQV) నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు.  క్వాంటం వ్యాలీ బిల్డింగ్ ఆగస్టు 2026 నాటికి సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జనవరి 2029 నాటికి సుమారు $ 1 బిలియన్ (దాదాపు రూ. 8,300 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Bill Gates Fida : క్వాంటం వ్యాలీ  ఏర్పడితే..

Bill Gates Fida

క్వాంటం వ్యాలీ నిర్మాణంతో   సుమారు 88,000 హై-స్కిల్డ్ (అత్యున్నత స్థాయి) ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.  దేశంలోనే అత్యంత సురక్షిత   2,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తారు, దీనివల్ల డేటా హ్యాకింగ్ భయం ఉండదు. ఆరోగ్యం (వైద్యం), ఫైనాన్స్, డిఫెన్స్ (రక్షణ),  వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చేలా 100కు పైగా ‘యూజ్ కేసులు’ (Use Cases) రూపొందిస్తారు. అమరావతిని బోస్టన్, సింగపూర్ ,  షాంఘై వంటి అంతర్జాతీయ సైన్స్ హబ్‌ల సరసన నిలబెట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ‘వైజర్ క్వాంటం టాలెంట్ హబ్’ ద్వారా 2035 నాటికి సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులో IBM, TCS,   L&T వంటి దిగ్గజ సంస్థలు సాంకేతిక భాగస్వాములుగా ఉన్నాయి. క్వాంటం వ్యాలీలో పరిశోధనలు చేసే సంస్థల కోసం ప్రభుత్వం దశలవారీగా 90 లక్షల చదరపు అడుగుల బిల్ట్ -అప్ ఏరియాను (R&D మౌలిక సదుపాయాలు) నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

Bill Gates Fida : అప్పుడు ల్యాప్​ టాప్​..

ఇప్పుడు పవర్​  ప్రజంటేషన్​

ఆకట్టుకున్న సీబీఎన్​ విజన్​

Bill Gates Fida

 సంజీవని ప్రాజెక్ట్   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంజీవని’ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పన, వ్యక్తిగతీకరించిన వైద్య సేవలు (Personalised Medicines) అందించడంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చలు జరిగాయి. ఏఐ (AI) భాగస్వామ్యం: ఆరోగ్యం, వ్యవసాయం ,  విద్యా రంగాల్లో మెరుగైన ఫలితాల కోసం కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించడంపై గత ఏడాది (మార్చి 2025) చేసుకున్న ఒప్పందం (MoU) పురోగతిని సమీక్షించినట్టు సమాచారం.  

Bill Gates Fida

 క్వాంటం వ్యాలీ కోసం  అమరావతిలో ప్రాథమికంగా 50 ఎకరాల భూమిని కేటాయించింది. భవిష్యత్తు అవసరాల కోసం మరో 200 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.  మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు రూ. 1,772 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనుంది.  మైక్రోసాఫ్ట్ తన క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ,  పరిశోధనా కేంద్రం కోసం క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం పక్కనే దాదాపు 4,000 చదరపు అడుగుల (4,000 Sq. Ft.) ప్రత్యేక సదుపాయాన్ని కోరినట్లు తెలుస్తోంది.  గతంలో (సెప్టెంబర్ 2024) మైక్రోసాఫ్ట్ అమరావతికి సమీపంలోని నందిగామ వద్ద సుమారు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.   ఇది డేటా సెంటర్ లేదా ఇతర అవసరాల కోసం ఉండవచ్చని అంచనా.

Bill Gates Fida : డేటా సెంటర్ల కోసం…తప్పని సరి

Bill Gates Fida

 మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని చాటుతోంది. డిసెంబర్ 2024లో మైక్రోసాఫ్ట్ ఇండియా సుమారు రూ. 181 కోట్లతో 25 ఎకరాల భూమిని ఏపీలో కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి.   హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే 48 ఎకరాల భారీ భూభాగాన్ని డేటా సెంటర్ల విస్తరణ కోసం సేకరించింది. అమరావతిని కూడా ఇదే తరహాలో ఒక టెక్ హబ్‌గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం.  ఇక్కడ కూడా అదనపు భూమి కోసం ప్రతిపాదనలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  భారతదేశంలో $17.5 బిలియన్ల భారీ పెట్టుబడితో మైక్రోసాఫ్ట్  ఏఐ ఆధారిత డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ఈ క్రమబద్ధమైన విస్తరణలో భాగంగా అమరావతిలో మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు కనీసం 50 నుంచి 100 ఎకరాల వరకు అదనపు భూమి అవసరం.   ఆరోగ్యం, వ్యవసాయం మరియు విద్యా రంగాల్లో మెరుగైన ఫలితాల కోసం కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించడంపై గత ఏడాది (మార్చి 2025) చేసుకున్న ఒప్పందం (MoU) పురోగతిని సమీక్షించారు. తాజా పరిస్థితితులను పరిశీలిస్తే..ఇన అమరావతి  విశ్వయోగం పొందినట్టే.

ALSO READ : Ap Cm  CBN :  వనరులు ఓకే   Andhra Ptabha Spot News

Leave a Reply