Bikkanur | యువకుడి దారుణ హత్య…

Bikkanur | యువకుడి దారుణ హత్య…

Bikkanur | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం మోటాట్ పల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఎర్ర రాజు(32) ను గ్రామంలోని గ్రామ సచివాలయం వెనుక‌ దారుణంగా హత్యచేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు (police) సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజును ఎవరు హత్య చేశారన్న దానిపై ప్రస్తుతం గ్రామంలో విచారణ కొనసాగుతుంది.

Leave a Reply