Bikkanoor | గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట…

Bikkanoor | గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట…
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మండలంలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి అన్నారు. ఈ రోజు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గ్రామీణ ప్రాంతా సీఎం కప్ క్రీడలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. వారి నైపుణ్యతను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పలు రంగాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఏ విభాగంలో రాణించేవారు ఆ విభాగంలో ముందుకు పోవాలని చెప్పారు.
క్రీడలలో ఓటమి చెందిన వారు నిరుత్సాహ పడకుండా రేపటి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో రాణించాలన్నారు. తమ వంతు సహకారం క్రీడాకారులకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కార్తీక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకన్న గారి బాగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
