Bikkanoor | దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి…

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని పట్టణ, వార్డు సభ్యులు ప్రవాస భారతీయుడు పెద్దబచ్చ జ్ఞాన ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఎడపాయల దుర్గమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఈసందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అమ్మవారి దయ వల్ల బిక్కనూరు పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ వార్డు కాకుండా పట్టణంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా… తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలో గల చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు శంకర్, రవి, తదితరులున్నారు.

Leave a Reply