బిగ్‌బాస్ హౌస్‌లో క్లియర్ కట్

బిగ్‌బాస్ హౌస్‌లో క్లియర్ కట్

వెబ్ డెస్కు, ఆంధ్ర‌ప్ర‌భ‌ : బిగ్‌బాస్ హౌస్ లో కొనసాగుతున్న అనుంబంధం.. ఆత్మీయత అంతా ఒక బూటకం అని బిగ్ బాస్ (Bigg Boss Season 9) 9వ సీజన్ లో 9 వారాల స్వీకెన్స్ నిరూపిస్తోంది. ఓ తండ్రి ఇద్దరు కూతుళ్ల అనురాగం ఒక వైపు, ఇద్దరి ఆడ‌వారి మధ్య పగ, ద్వేషం మరొక వైపు ఈ రిలేషన్.. ట్విస్టుల మీద ట్విస్టులు తిప్పుతుంటే.. తల్లీ కొడుకుల బాండింగ్.. ఓ యువతీ-యువకుడి మధ్య సన్నిహిత బాండింగ్.. ఇలా మూడు రిలేష‌న్ల‌లో కుట్రలు, కుతంత్రాలకు బిగ్ బాస్ హౌస్ వేదికగా మారింది.

ఇది నిజం. వాస్తవానికి ఒక‌రికొక‌రు ఏదో రిలేష‌న్‌పై అనుబంధం పెంచుకోక తప్పదు. ప్రధానంగా కెప్టెన్సీ టాస్క్‌లో ఒక‌రి మ‌ద్దతు మరొక‌రికి చాలా అవ‌స‌రం. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో అనుబంధం త‌ప్పనిస‌రి అవుతుంది. ఈ బాండింగ్‌ల వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం? ఎవరికి లాభం? అనేది చ‌ర్చ ఈ సీజ‌న్‌లో పెద్ద ఎత్తున జ‌రుగుతుంది.

గ‌త సీజ‌న్‌లో లేని బాండింగ్ పై చ‌ర్చ ఈ సీజ‌న్‌లో చోటుచేసుకుంది. బిగ్ బాస్‌ 9 వ సీజ‌న్‌లో మూడు ర‌కాల బాండింగ్‌లు ఉన్నాయి. ఇందులో భ‌ర‌ణి, దివ్య‌, త‌నూజ బాండింగ్‌పై ఒక పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంటా, బ‌య‌ట కూడా ఈ బాండింగ్‌పై పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఇమ్మాన్యుయేల్‌, సంజ‌న్ (Emmanuel, Sanjan) తోపాటు రీతు, ప‌వ‌న్ మ‌ధ్య కూడా బాండింగ్ ఉంది.

9వ సీజ‌న్ మొద‌ట్లోనే హౌస్‌లోకి ప్రవేశించిన భ‌ర‌ణిని త‌నూజ నాన్న అని పిలిచేది. తాను కంఫర్టుగా భ‌ర‌ణితో అన్ని విష‌యాలు షేర్ చేసుకునేది. సంజ‌న‌ను ఇమ్మానుయేల్ అమ్మా అనే పిలిచేవాడు. వారిద్దరి మ‌ధ్య కూడా బాండింగ్ కొన‌సాగుతోంది. ఆట విష‌యానికి వ‌స్తే వారిద్దరి మ‌ధ్య బాండింగ్ అనేది క‌నిపించ‌కుండా జాగ్రత్త ప‌డేవారు. ఇక రీతూ, ప‌వ‌న్ మ‌ధ్య ఒక ట్రాక్ న‌డిపించ‌డంలో బిగ్‌బాస్ స‌క్సెస్ అయింది. ఈ ట్రాక్‌కు బ్రేక్ ఇవ్వాల‌ని చూసినా ప్రస్తుతం ఆ బాండింగ్ కొన‌సాగుతోంది. వైల్డ్ కాల్డ్ ఎంట్రీ దివ్య కూడా భ‌ర‌ణితో తండ్రిగా బాండింగ్ చేసుకుంది.

ఇక భ‌ర‌ణి బాండింగ్ విష‌యంలో ఇద్దరూ త‌నూజ‌, దివ్య మ‌ధ్య కూడా ఎన్నో వివాదాలు, విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు కూతుళ్ల మ‌ధ్య న‌లిగిపోయిన భ‌ర‌ణి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన శ్రీ‌జ‌, భ‌ర‌ణికి వివిధ పోటీలు నిర్వహించి, చివ‌ర‌కు హౌస్ మెంబ‌ర్స్ అభిప్రాయం మేర‌కు భ‌ర‌ణి తిరిగి హౌస్‌లోకి ఎంట‌ర్ అయ్యారు.

త‌నూజ‌కూ మూడోసారి చేజారిన కెప్టెన్సీ
బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss House)లోకి 9వ వారం కెప్టెన్సీ త‌నూజ‌కు చేజారింది. కెస్టెన్సీ టాస్క్‌ నుంచి త‌నూజ‌ను దివ్య ఎలిమినేట్ చేసింది. చివ‌ర‌కు మిగిలిన ఇమ్మాన్యూయేల్‌, రీతూ మ‌ధ్య జ‌రిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ విజ‌యం సాధించి 9వ వారం కెప్టెన్సీని ద‌క్కించుకున్నాడు. ఏడో వారంలో ఇమ్మాన్యుయేల్ మ‌రోసారి కెప్టెన్ అయ్యాడు. ఇందుకు దివ్య స‌పోర్టు చేయ‌డమే ప్రధాన కార‌ణం. ఈ క్రమంలో దివ్యకు, త‌నూజ‌కు మధ్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ కొన‌సాగింది.

ఆరుగురు కంటెంస్టెంట్లకీ ట్రెయిన్ ఇంజిన్ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ట్రెయిన్ ఇంజిన్‌లోకి ఎవరు ఎక్కుతారో వారు కారణాలు చెప్పి కంటెస్టెంట్ల నుంచి ఒకరిని తప్పించాలి. దివ్యకు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు త‌నూజ‌, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ రేసులో మిగిలారు. ఈ టాస్క్ నుంచి త‌నూజ‌ను ఎలిమినేట్ చేస్తున్నట్లు దివ్య ప్రక‌టించింది.

ఈ క్రమంలో త‌నూజ కోపంగా మాట్లాడుతూ గేమ్ ప‌రంగా చూడ‌కుండా, వ్యక్తిగ‌త బాండింగ్ చూస్తూ ఎలిమినేట్ చేశావ‌ని మండిప‌డింది. దీంతో దివ్య కూడా కోపంగా చూస్తూ.. భ‌ర‌ణి గారు దీనిపై మీరు స్టాండ్ తీసుకోండి అన్నది. ఇందుకు భ‌ర‌ణి కూడా మండిప‌డ్డారు.
త‌నూజ ప్రతిసారీ ఫైనల్ వ‌ర‌కూ వ‌చ్చి ఓడిపోతోంది. ఏడో వారంలో ఇమ్మాన్యుయేల్‌, త‌నూజ ఫైన‌ల్‌కు వ‌చ్చారు. ఎనిమిదో వారం దివ్య‌, త‌నూజ ఫైన‌ల్‌కు వ‌చ్చారు. ఈ సారి ఫైన‌ల్‌కు రావాల్సిన త‌నూజ‌ను దివ్య ఎలిమినేట్ చేసింది. చాలా వారాలుగా కెప్టెన్ అయ్యేందుకు తనూజ ట్రై చేస్తుంది. దీంతో కెప్టెన్సీ మూడోసారి కూడా ద‌గ్గర‌లోకి వ‌చ్చిన‌ త‌నూజ‌కు చేజారిపోయింది.

న‌ష్టపోతుంది ఎవ‌రు?
ఈ సీజ‌న్‌లో బాండింగ్‌ల‌తో న‌ష్టపోతుంది ఎవ‌రు? అనేది కూడా ఇంటా, బ‌య‌టా కూడా చ‌ర్చ జ‌రుగుతుంది. భ‌ర‌ణి-త‌నూజ (Bharani-Tanuja) , భ‌ర‌ణి-దివ్య మ‌ధ్య తండ్రి కూతుళ్ల బాండింగ్ ఉంది. త‌నూజ‌, దివ్య మ‌ధ్య మాత్రం మంచి బాండింగ్ లేదు. ఇదే భ‌ర‌ణికి న‌ష్టప‌రిచింద‌ని కూడా ఇంటా, బ‌య‌ట చ‌ర్చ జరిగింది. ఈ బాండింగ్ వ‌ల్లే భ‌ర‌ణి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని చ‌ర్చ కూడా జ‌రిగింది.

రెండోసారి ఎంట‌ర్ అయిన భ‌ర‌ణి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, బాండింగ్ ముద్ర ప‌డుతోంది. బిగ్‌బాస్‌లో సంజ‌న (Sanjana in Bigg Boss) మాట్లాడుతూ వారిద్దరి మ‌ధ్య భ‌ర‌ణి న‌లిగిపోతున్నార‌ని అన్నారు. త‌నూజ త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ… వారిద్దరి మ‌ధ్య త‌ను న‌ష్టపోతున్నాన‌ని, గేమ్స్ ఎంత బాగా ఆడినా ఫ‌లితం క‌నిపించ‌డం లేద‌ని క‌న్నీరు పెట్టుకుంటోంది. అమ్మా అంటూ సంజ‌న‌తో బాండింగ్ కొన‌సాగిస్తున్న ఇమ్మాన్యుయేల్ కు గానీ, ప‌వ‌న్‌-రీతూ మ‌ధ్య ఉన్న బాండింగ్ లో ఎవ‌రి గేమ్ వారు ఆడుతున్న ఎక్కడా వారిద్దరూ న‌ష్టపోవ‌డం లేదు. ఈ బంధాలు పేరుతో గేమ్ ఆడుతూ కుట్ర‌లు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.

Leave a Reply