ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. న్యూ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. మరోవైపు జంగ్ పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోడియా ఓటమి చవిచూశారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.