Bichkunda | నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం..

Bichkunda | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు వరం అని పుల్కల్ సర్పంచ్ సంతోష్ పటేల్ అన్నారు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ముగ్గులు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.
నియోజకవర్గానికి ఇంకా అదనంగా లబ్ధిదారులు ముందుకు వస్తే ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం ఎమ్మెల్యే కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మిని తుకారం, వార్డు సభ్యులు నాగం శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్ రెడ్డి, నాయకులు మేత్రితుకారం, గ్రామ పెద్దలు కర్కల్ మారుతి, ఎంజీఆర్, పుల్కల్ గ్రామ సెక్రెటరీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
