Bhuvanagiri | జాతీయ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా..

Bhuvanagiri | జాతీయ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా..

  • బాల్యం వెంకటాచలపతి

Bhuvanagiri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి సముచిత స్థానం కల్పించింది. విద్యార్థి రాజకీయాల్లోనూ రాణించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్యం వెంకటా చలపతిని జాతీయ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా మూడు సంవత్సరాలు కొనసాగుతారని సర్కులర్ లో పేర్కొన్నారు. న్యాయవాదిగా మంచిపేరు సంపాదించిన బాల్యం వెంకటాచలపతికి సముచిత గౌరవం కల్పించడం పట్ల జిల్లా, స్థానిక నేతలు, నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply