ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం గా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో ఆదివారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష న స్పందన లభిస్తుంది. నియోజకవర్గం లోని ప్రతి మండలంలోని నిరుద్యోగులు జాబ్ మేళా వచ్చేందుకు ఎమ్మెల్యే జీ ఎస్ ఆర్ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడంతో వేలాదిగా నిరుద్యోగులు ప్రాంగణంకు తరలివాస్తున్నారు.
నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టిఫిన్స్, మంచినీటి సౌకర్యం భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కో నిరుద్యోగ అభ్యర్థి కేవలం ఒక్క కంపెనీనే కాకుండా, నాలుగైదు కంపెనీలను ఎంపిక చేసుకోవాలని, సాయంత్రం 7.00 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు తెలిపారు.