హైదరాబాద్ – భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు (బుధవారం)వీరి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులను ప్రశ్నించింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది. ఈకేసుకు సంబంధించి సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆపై ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ముగించింది.
కాగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోనిసర్వే నెంబర్ 194లో ఐపీఎస్‌లు భూములు కొన్నారు. సర్వే నెంబర్‌లో 194 లో 16,20,18 గుంటలుగా భూములను ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే సర్వే నెంబర్ 181, 182,194,195 భూముల నిషేధిత జాబితాలో ఉంచాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్‌లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని..హైకోర్టులో ఐఏఎస్ ఐపీఎస్‌ల అప్పీళ్లు చేశారు. తాము కొన్న భూములు భూదాన్‌వి కాదని,పట్టా భూమూలేనంటూ ఐఏఎస్, ఐపీఎస్‌ల పిటిషన్‌లు వేశారు.