Bhimgal | భర్తను చంపిన భార్యలు

Bhimgal | భర్తను చంపిన భార్యలు
డీజీల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య
Bhimgal | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : మానవత్యం మంటగలుస్తోంది. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. క్షణికావేశం మనసుల్ని రాక్షసులుగా మారుస్తోంది. కట్టుకున్న భర్తను ఇద్దరు భార్యలు డీజిల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఎస్సై కే.సందీప్, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… భీమ్‌గల్ (Bhimgal) పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమ్ నగర్ (దేవక్కపేట్) లో సోమవారం జరిగింది.

గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ (Malavat Mohan) (39) కు ఇద్దరు భార్యలు, ఐదుగురు కుమార్తెలు. మృతుడు మొదటి భార్య సంగీత ది మానాల, రెండో భార్య కవిత ది తాళ్లపల్లి గ్రామం. మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా మృతుడు ఇంటి వద్ద వ్యవసాయం పనులు చేసుకుంటూనే, వివాహలకు, శుభకార్యాలకు బ్యాండ్ కొట్టేందుకు తాత్కాలికంగా వెళ్తాడు. మృతుడు మోహన్ కు ఇద్దరు భార్యలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం సైతం భర్త, ఇరువురు భార్యలతో గొడవ జరిగినట్టు సమాచారం.
Bhimgal | ఈ ఘటన గ్రామంలో వ్యాపించడంతో ఒక్కసారిగా
గొడవలో అవేశానికి గురైన ఇద్దరు భార్యలు కుర్చీలో కూర్చుని ఉన్న భర్త మోహన్ పై డీజిల్ (diesel) చల్లి నిప్పంటించారు. మంటలు ఒక్కసారి వ్యాపించి మోహన్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గ్రామంలో వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. భర్తను దారుణంగా హత్య చేసిన భార్యలు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లులు ఇద్దరు జైలుకు వెళ్లడం తో ఐదుగురు ఆడపిల్లలు అనాధలుగా మారారు. ఈ సంఘటన భీమ్‌గల్ మండలంలో తీవ్ర కలకలం రేపింది.
