Bhimgal | ముత్యాలను కలిసిన సర్పంచుల ఫోరం

Bhimgal | ముత్యాలను కలిసిన సర్పంచుల ఫోరం
Bhimgal | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గం సభ్యులు ఈ రోజు బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మోర్తాడ్ లోని ప్రజా నిలయానికి వెల్లిన కార్యవర్గం సభ్యులు ముత్యాల ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన పిప్రి సర్పంచ్ అరిగేల జనార్దన్ ను ముత్యాల శాలువాతో సత్కరించారు.
ముత్యాలను కలిసిన వారిలో ఫోరం ఉపాధ్యక్షుడు సికింద్రాపూర్ తండా సర్పంచ్ రమేష్, ప్రధాన కార్యదర్శి పల్లికొండ సర్పంచ్ పిండి మనుష (పిండి అశోక్ ), కార్యదర్శి చేంగల్ సర్పంచ్ దుమాల మమత (దుమాల రాజు) ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పర్శ అనంత్ రావు, సంతోష్ నగర్ తండా నాయకుడు పాల్త్యా శివ తదితరులు ఉన్నారు.
