ఘనంగా భీమ్ వర్ధంతి వేడుకలు

జైనూర్,/ అసిఫాబాద్ అక్టోబర్ 7 (ఆంధ్రప్రభ ) : కొమరం భీమ్‌ అసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలంలోని జోడేఘాట్ లో మంగళవారం కొమరం భీమ్ 85వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విట్టల్, మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు, అసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ముఖ్య అతిథులుగా పాల్గొని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం స్థానిక కొమరంభీమ్‌ మ్యూజియం ను కాసేపు సందర్శించారు. ఈ వర్ధంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి,ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, ఎస్పీ క్రాంతి పాటిల్, అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, కొమరం భీమ్ మనుమడు కుమ్ర సోనే రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగులు రాజకీయ పార్టీ నాయకులు, ఆదివాసీలు పాల్గొని కొమరం భీమ్ కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ప్రతి ఏడాది జోడేఘాట్ లో కొమురం భీం వర్ధంతి సందర్భంగా దర్బార్ కార్యక్రమం నిర్వహించే వారు దర్బార్ లో బీమ్ చేసిన పోరాట స్ఫూర్తిని వివరిస్తూ ఆదివాసులకు హక్కులు, తదితర సమస్యలపై ప్ర స్తవిస్తారు. కేవలం ఈసారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వపరంగా అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా మంగళవారం జోడే ఘాట్ లో ఈసారి దర్బారు నిర్వహించలేదు. కేవలం ఆదివాసి సంప్రదాయంగా నిర్వహించిన భీమ్ వర్ధంతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఆదివాసీ నాయకులు ఆదివాసీలు పాల్గొనిభీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply