Bheemgal | ఒక్క సారి గెలిపించండి…

Bheemgal | ఒక్క సారి గెలిపించండి…

Bheemgal | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : ఒకటో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శెవ్వ సుజాత ను గెలిపించాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ రోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పట్టణం లోని 1, 2, 3 వార్డుల్లో పర్యటించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి రెండేండ్లు అయిన పట్టణంలో ఒక్క రూపాయి కూడ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన పనులు రెండేండ్లు చేయకుండా అడ్డుపుల్ల వేసి అవే పనులకు డేట్ మార్చి మున్సిపల్ ఎన్నికలు రావడం తో మంత్రి సీతక్క ను రప్పించి శంకుస్థాపన లు చేయించారని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలు వస్తేనే అభివృద్ధి పనులు గుర్తుకు వస్తాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పట్టణం లోని అన్ని వార్డు లను అభివృద్ధి చేసిన సంగతి గుర్తు చేశారు. ఒకటో వార్డు అయ్యప్పనగర్, శ్రీరాం నగర్, విద్యానగర్, కొత్త బస్టాండ్ ఏరియాల్లో రోడ్లు, మురికి కాలువలు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని అన్నారు. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అని అభివృద్ధి నిరోధకులకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. భీంగల్ ను మున్సిపల్ గా చేసి, అభివృద్ధి కొరకు 25 కోట్లు మంజూరు చేయించిన బీఆర్ఎస్ కు అండగా ఉండాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డుల్లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Leave a Reply