Bheemgal | ఆర్టీవో చాలాన్ పేరిట మోసం…

Bheemgal | ఆర్టీవో చాలాన్ పేరిట మోసం…

Bheemgal | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : రోజు రోజుకు సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మొన్నటి వరకు సైబర్ క్రైమ్ పేరిట కాల్ చేసి మీ పిల్లలు డిజిటల్ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం వారు సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నారని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. వారి ఫోన్ కాల్స్ కు బయపడిన పిల్లల తల్లి తండ్రులు మోసగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. మిలిటరీ డ్రెస్ తో కూడిన వాట్సాప్ డీపీ ఉన్న ఫొటోలతో కూడిన ఫోన్ కాల్స్ రావడంతో నిజమే అనుకుని నమ్మిన ప్రజలు వారు అడిగిన డబ్బులు చెల్లించి మోసపోయారు. వారు డిజిటల్ అరెస్ట్ ల పేరిట చేస్తున్న మోసం పై పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించారు.

డిజిటల్ అరెస్ట్ లాంటివి ఉండవని, అలాంటి ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావొద్దని సూచించారు. ప్రజల్లో చైతన్యం రావడం తో డిజిటల్ అరెస్ట్ ల పేరిట కాల్స్ రావడం తగ్గిపోయాయి. తీరా ప్రస్తుతం ఆర్టీవో ఆఫీస్ పేరిట వాట్సాప్ కు ఏపీకే పిడిఎఫ్ లు పంపిస్తున్నారు. డీపీ లో పోలీస్ డ్రెస్ తో కూడిన వ్యక్తి దానికింద ఆర్టీవో ఆఫీస్ అని రాసి ఉంది. మీ బండికి చాలాన్ పడిందని పిడిఎఫ్ వస్తోంది. భీంగల్ ప్రాంతం లో ప్రస్తుతం మొబైల్ నంబర్స్ కు ఏపీకే పిడిఎఫ్ లు చాలాన్ పేరిట వస్తున్నాయి. తెలియని కొందరు పిడిఎఫ్ ఫైల్ ను క్లిక్ చేస్తే చాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 9140687413 నెంబర్ నుండి ఇలాంటి ఏపీకే పిడిఎఫ్ ఫైల్స్ ను సైబర్ నేరగాళ్ళు పంపిస్తున్నారు.

Bheemgal

ఓపెన్ చేస్తే చాలు…

ఏపీకే చాలాన్ పేరిట వస్తున్న ఫైల్ ను ఇన్స్టాల్ చేయగానే ఫోన్ నియంత్రణ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుంది. వ్యక్తిగత సమాచారం, ఫొటోస్, కాంటాక్ట్ నంబర్స్, వాట్సాప్ డేటాను వారు చోరి చేస్తారు. అమాయకుల కష్టార్జితం కొళ్లగొడుతున్నారు. సమాచారం సేకరించి బ్యాంకు ఖాతా ఖీళీ చేస్తారు.

ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు… సీఐ

ఏపీకే ఫైల్స్ పేరిట వస్తున్న లింక్ లను ఎట్టి పరిస్థితి లో ఓపెన్ చేయొద్దని సీఐ సత్యనారాయణ గౌడ్ కోరారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రామ్, మెయిల్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఏపీకే అప్స్ లింక్ లను డౌన్ లోడ్ చేయొద్దు. ఎట్టి పరిస్థితి లో ఓటీపీ, బ్యాంకు వివరాలు, ఎవరికీ చెప్పొద్దు, బ్యాంకు వివరాలు, ఓటీపీ లు, పాస్ వర్డ్ లను ప్రభుత్వరంగ సంస్థలు గాని బ్యాంకులు గాని ఫోన్ ద్వారా అడగవని అన్నారు. సైబర్ అటాక్ జరిగిందని తెలిసిన వెంటనే 1930 నెంబర్ కు కాల్స్ చేసి పిర్యాదు చేయాలని సూచించారు.

Leave a Reply