BHAGAVAN | మానవత్వానికి మారు పేరు..

సాయిబాబా శత జయంతి

BHAGAVAN| నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : భగవాన్ సత్య సాయిబాబా మానవత్వానికి మారుపేరుగా నిలిచారని, ఆయన సేవలు సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శం కావాలని ట్రైని కలెక్టర్ శ్రీ ప్రణయ్ కుమార్ అన్నారు. ఆదివారం సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ సత్య సాయిబాబా చిత్రపటానికి పూలమాల అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. సాయిబాబా చేసిన సేవలను స్మరించుకుంటూ, జిల్లాలో నీటి ఎద్దడి సమయంలో ప్రత్యేక పంపులు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించడం వంటి సేవాకార్యాలు ఆయన మహోన్నతత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు.

ప్రభుత్వం అందించే ఉచిత పథకాలతో సమానంగా, సత్య సాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలను పూర్తిగా ఉచితంగా అందించడం విశేషమని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏవో శ్రీధర్, డి.వై.ఎస్.ఓ వెంకటేష్, శివరాజ్, విజయ్ కుమార్ కనిగిరి, మాజీ కౌన్సిలర్ మారుతీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply