బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో ​భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి పార్టీ పతాకాన్ని తన నివాసంపై ఆవిష్కరించారు. ​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే నేడు బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అవినీతి రహిత పాలనను అందిస్తూ, అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మోడీ దేశానికి ఆదర్శంగా నిలిచారు” అని కొనియాడారు.

​ఈ సందర్భంగా అమరం మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ సానుభూతిపరులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply