మాహగం సబ్ సెంట‌ర్‌కు ఉత్తమ అవార్డు…

మాహగం సబ్ సెంట‌ర్‌కు ఉత్తమ అవార్డు…

సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మాహగం సబ్ సెంటర్ కు ప్రభుత్వపరంగా ఉత్తమ ప్రశంస అవార్డు రావడం ఎంతో సంతోషకరమని మహాగాం సర్పంచ్ సెడుమకి జానే రావు అన్నారు.

మహాగం సబ్ సెంటర్కు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ సెంటర్ కు ఉత్తమ అవార్డును మహాగం సబ్ సెంటర్ ఏఎన్ఎం జై లలిత, హెల్త్ అసిస్టెంట్ ఆర్ దినేష్ లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రంతో పాటు అవార్డు అందుకోవడం సంతోషకరమని సర్పంచ్ అన్నారు. ఇలాగే ఉత్తమ సేవలందించి సబ్ సెంటర్ కు మంచి పేరు తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ సెంటర్ వైద్య ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply