Best Award | ఐటీడీఏ డీడీ అంబాజీ జాదవ్‌కు ఉత్తమ అవార్డు

Best Award | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తు ఉత్తమ సేవలు అందించినందుకు అంబాజీ జాదవ్ కు జిల్లాస్థాయి ఉత్తమ పురస్కార అవార్డు లభించింది. ఈ అవార్డును ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా అందించినట్లు డీడీ అంబాజీ జాదవ్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉత్తమ సేవలందించినందుకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply