Bengaluru | మరో ఐటీ సిటీ..

Bengaluru | మరో ఐటీ సిటీ..

Bengaluru, బెంగళూర్ : కర్నాటక (Karnataka) ప్రభుత్వం మరో కొత్త ఐటీ సీటీని నిర్మించాలని నిర్ణయించింది. బెంగళూర్ టెక్ సమ్మిట్ -2025్న ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో పలు జాతీయ, 60కి పైగా దేశాలకు చెందిన అంతర్జాతీయ టెక్ కంపెనీలు పాల్గొన్నాయి. బెంగళూర్ సమీపంలోని బిడాడీ ప్రాంతంలో కొత్త ఐటీ సిటీని నిర్మిస్తామని ఈ సందర్భంగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ప్రకటించారు. కొత్త ఐటీ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జా తీయ కంపెనీలు, సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. కర్నాటక టెక్నాలజీ ఎకోసిస్టమ్పై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్న గ్లోబల్ కంపెనీల సంఖ్య పెరుగుతుందన్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదిస్తోందని, ఐటీ సెక్టర్కు మరింత స్పేస్ కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అనేక కంపెనీలు, సంస్థలు పెట్టుబడుల విషయంలో నిరంతరం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నారని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారు.

బెంగళూర్లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ, జాతీయ ఐటీ సంస్థలు, ఇతర తయారీ సంస్థలు ఉన్నాయి. మౌలిక సదుపాయలు, రవాణా సదుపాయలు సరిపోవడం లేదు. రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం బెంగళూరు దూరంగా కొత్త ఐటీ సిటీ నిర్మించాలని నిర్ణయించింది. దీంతో పాటు మైసూర్, మంగళూర్లోనూ (Mangaluru) ఐటీ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించాలని భావిస్తోంది. కర్నాటక ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ పాలసీ ప్రకారం టైర్-2 సిటీల్లో స్టార్టప్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సంస్థలకు 50 శాతం రెంట్ 2 కోట్లకు మించకుండా రాయితీ ఇస్తారు. ఆస్తి పన్నులో 30 శాతం రీఎంబర్స్ చేస్తారు. విద్యుత్ బిల్లులను 5 సంవత్సరాల పాటు 100 శాతం రద్దు చేస్తారు. టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లులను 12 లక్షల వరకు రాయితీ ఇస్తారు. ఆర్ అండ్ వ్యయంలో 40 శాతం, 50 కోట్లకు మించకుండా రీఎంబర్స్ చేస్తారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com

Leave a Reply