ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పట్టణ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కొత్త బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. పట్టణంలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజబాబు గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రవి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply