Bellampalli | రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది…

Bellampalli | రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది…
- మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపణ
Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని టీ బీ జీ కే ఎస్ కార్యాలయం లో 77 వ ఘనతంత్ర్య దినోస్తవం సందర్బంగా త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెల్లంపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని స్థానికంగానే ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆ తర్వాత ప్రజలకు మోసం చేసి హైదరాబాదు నుంచి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే ఇప్పటికైనా బెల్లంపల్లిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో బెల్లంపల్లి పట్టణం లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకురూ,, 31కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కుశంకు స్థాపన చేశామని చిన్నయ్య ఆయన తెలిపారు. ఇప్పటివరకు రెండేళ్లుగాఎమ్మెల్యే గా గెలిచిన గడ్డం వినోద్ కనీసం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని పేర్కొన్నారు.
కోట్ల రూపాయలు మంజూరు చేయించామని నేడు వెలగడ్డ వినోద్ బెల్లంపల్లిలో శంకుస్థాపనలు చేయడం ప్రజలను నమ్మించిమరోసారి మోసం చేయడమే అన్నారు. కోట్ల రూపాయలు అభివృద్ధినిధులుతీసుకువచ్చామని మభ్యపెట్టి మరో కొత్త మోసం చేస్తున్నారని చిన్నయ్య విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని అప్పుడే బెల్లంపల్లి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి వెంకటరమణ ఏరియా సెక్రెటరీ దాసరి శ్రీనివాస్, నాయకులు అలవేణి సంపత్, బడికల రమేష్, కళాని నర్సయ్య, అనుముల సత్యనారాయణ, సబ్బని అరుణ్, ఎరుకల సుందర్రావు, ముర్కూరి చంద్రయ్య, ఆసాది మధు, మహమ్మద్, అనీఫ్ మద్దెల గోపికృష్ణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
