Kurnool | ఇరిగేషన్ సిబ్బందిపై తేనెటీగల దాడి

కర్నూల్ బ్యూరో : వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఇరిగేషన్ ఇంజనీర్లతో పాటు విజిలెన్స్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి గాయాలు కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు చెందిన ఆనంద్ బాబు, క్వాలిటీ కంట్రోల్ టీం కేసీ కెనాల్ చెందిన కృష్ణప్రియ, మైనర్ ఇరిగేషన్ చెందిన రవి నాయక్ తీవ్రంగా గాయపడ్డారు.

కర్నూలు జిల్లా ఇరిగేషన్ శాఖ పరిధిలో 2017 – 18లో నీరు.. చెట్టు కింద జరిగిన చెక్ డ్యాములు, ఇతర కాల్వ పనులు అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వచ్చాయి. వీటి తనిఖీలో భాగంగా విజిలెన్స్ విభాగంతో కలిసి ఇరిగేషన్ ఇంజనీర్లు సంఘటిత ప్రాంతానికి తరలివెళ్లారు. అయితే ఊర్లోకి వెళ్తుండగానే తేనెటీగలు ఇంజనీర్ల బృందంపై దాడిచేశాయి. దీంతో చెల్లా చెదిరి పరుగులు తీస్తున్న ఇంజనీర్లను వదలకుండా కుట్టాయి. తేనెటీగల దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు చెందిన ఆనంద్ బాబు, కేసీ కెనాల్ ఇంజనీర్ కృష్ణప్రియ పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *