రైతు సంక్షేమమే ధ్యేయం..
- గంగమ్మ తల్లికి పూజలు
- ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య
ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : రైతు సంక్షేమమే (Farmers Welfare) ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) అన్నారు. శుక్రవారం జనగాం జిల్లాలోని నవాబుపేట రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డితో కలసి నీటిని విడుదల చేసారు.
ఈసందర్భంగా బీర్ల ఐలయ్య గేటు తిప్పి గుండాల మండలానికి (Gundala Mandal) నీటిని విడుదల చేసి, గుండాల వైపు వెళ్తున్న గంగమ్మ తల్లికి పువ్వులు, కుంకుమ, పసుపు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

