రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమాన విధింపు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు “రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు” మంగళవారం నిర్వహించరు. నంద్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యమైన ప్రాంతాలలో, కూడళ్లలో ప్రజలతో పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాష శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం మోటార్ సైకల్ పై వచ్చే భక్తులు రోడ్డు ప్రమాదలను నివారించేందుకు తప్పనిసరిగా హెల్మెట్ దరించాలని ,వేగం తగ్గించి వాహనాన్ని నడపాలని, ముఖ్యంగా ఘాట్ రోడ్డు నందు వున్నా మలుపులు వద్ద ముందు వెళ్లుచున్న వాహనాన్ని ఎట్టి పరిస్థులల్లో ఓవర్ టేక్ చెయ్యరాదని అవగాహన కల్పించడం జరిగిందన్నారు.


వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు .
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు వాహనాలకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మరియు పరిమితికి మించి ప్రయాణికులను సరుకులను రవాణా చేయరాదన్నారు .


మోటార్ సైకిల్లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం జరిగిందన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసు అధికారులు సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply