ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి…

- షుగర్ మీటర్‌కు బదులుగా సబ్బుబిళ్ల
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ కొనుగోళ్లలో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. చూపేది ఒక వస్తువు, డెలివరీ అయ్యేది మరొక వస్తువు. వివరాల్లోకి వెళితే.., శివనగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ.700 విలువైన షుగర్ (గ్లూకోమీటర్) మిషన్‌ను ఆర్డర్ చేశాడు.
కొరియర్ వచ్చినప్పుడు, డెలివరీ బాయ్ తాను ఆర్డర్ చేసిన మిషన్ వచ్చిందని నమ్మబలకడంతో, ఆ వ్యక్తి డబ్బు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నాడు.
అయితే, కొరియర్ బాయ్ వెళ్లిపోయిన అనంతరం బాక్స్‌ను తెరిచి చూడగా, అందులో గ్లూకోమీటర్ మిషన్‌కు బదులుగా సబ్బుబిళ్ల ఉండటం చూసి తాను మోసపోయానని గ్రహించాడు.
వెంటనే ఆ బాక్స్‌పై ఉన్న ఫోన్ నంబర్‌కు గత రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నప్పటికీ, ఆ నంబర్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఆన్‌లైన్ మోసగాళ్లు ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే, దానికి బదులుగా బిస్కెట్ ప్యాకెట్లు, సబ్బులు లేదా అగ్గిపెట్టెల వంటి వాటిని సరఫరా చేస్తున్నారు.
కావున, ఆన్‌లైన్లో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్త వహించి, మోసపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరడమైనది.
