BC reservations | మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి వేడుకలు

BC reservations | మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి వేడుకలు
BC reservations | బెల్లంపల్లి | ఆంధ్రప్రభ :బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ రోజు మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి దాగం శ్రీనివాస్(Dagam Srinivas) అధ్యక్షత వహించారు.
మహాత్మ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకుల్లో
జిల్లా ఇంచార్జి నాగుల కిరణ్ బాబు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్(Mulkalla Rajendraprasad), ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాగం శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మహాత్మ జ్యోతిబా ఫూలే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఫూలే సిద్ధాంతాలను నిజాయితీగా అమలు చేస్తోన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీనే అన్నారు. బీసీ రిజర్వేషన్లు(BC reservations) సంపూర్ణ రూపం దాల్చాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వాల్సిందేనని పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్లకు ఆర్టికల్ తొమ్మిదో షెడ్యూల్ ద్వారా చట్టబద్ధత ఇవ్వాల్సిన అవసరం ఉందిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, మందమర్రి మండల అధ్యక్షుడు రహీం బాబా, బెల్లంపల్లి నాయకులు తాటిపెల్లి అభిలాష్, అంగూరి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
