సుల్తానాబాద్, జులై 31 (ఆంధ్రప్రభ): బీసీ గురుకులాల్లో (BC Gurukuls) విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ గురుకులాల కార్యదర్శి (Secretary of BC Gurukuls) శ్యామ్ ప్రసాద్ (Shyam Prasad) పేర్కొన్నారు. గురువారం సుల్తానాబాద్ (Sultanabad) లోని బీసీ గురుకుల వసతి గృహంతో పాటు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈసందర్భంగా గురుకులంలో, డిగ్రీ కాలేజీలో సౌకర్యాలు, విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ… ప్రభుత్వం బీసీ గురుకులాల్లో సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక కృషి చేస్తోందని, అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యతతోపాటు రుచికర మైనవిగా ఉండాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. తరచూ అధికారులు ఇలాంటి తనిఖీలు చేయాలని పలువురు పేర్కొంటున్నారు.