బీసీ డిక్లరేషన్ అమలు పరచాలి
ఉట్నూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీసీలకు 42% అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి రోడ్డు బిసి డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీసీలకు 42% అన్ని రంగాల్లో రిజర్వేషన్(Reservation) కల్పిస్తామని కామారెడ్డి రోడ్డు బిసి డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల బీసీ సంఘాల నాయకులు తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలు విద్యాపరంగా ఉధ్యోగపరంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని అన్ని నామినేట్ పోస్టులు(nominated posts) కమిషన్లు బోర్డుల్లో, సలహా మండలిలో అన్నింటిలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తమరి ద్వారా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు పంపాలని బీసీ సంఘాల కన్వీనర్ శ్రీపతి లింగాగౌడ్ తాసిల్దార్ కు కోరారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో వినతి పత్రం ఇచ్చిన వారిలో బీసీ ఐక్యవేదిక ఉట్నూర్ మండల కన్వీనర్ సిపతిలింగాగౌడ్,కోకన్వీనర్లు కట్టా లక్ష్మణ చారి,కందుకూరి రమేష్, దావులే బాలాజీ, సాడిగే రాజేశ్వర్(Sadige Rajeshwar), బింగి వెంకటేష్,కొండేరి రమేష్ బొడ్డు కిరణ్, తొగరి రఘు,గొల్లపెల్లి శ్రీనివాస్, మరికంటి మహేష్, గంటా విజయ్, పాకాల గంగాధర్, శ్రీ మంగలి రాహుల్, చింతల రమణ,సిద్ధం నవీన్, పందిరి భీమన్న,పొన్నం జగన్, సాదని సాయి,ఆరేపల్లి రాజన్న, షికారి శ్రీనివాస్, జడ మహేష్త దితరులు పాల్గొన్నారు.

