Battery Cycle | దివ్యాంగులకు చేయూత
బ్యాటరీ ట్రై సైకిల్స్ పంపిణీ
Battery Cycle | పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గం పోరంకి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ సామర్థ్యంతో నడిచే ట్రై సైకిళ్లను తెదేపా యువ నాయకుడు బోడే వెంకట్రామ్ అందించారు. విభిన్నప్రతిభావంతులుగా, వివిధ రకాల అనారోగ్యాల కారణంగా సమాజంలో సాధారణ జీవితానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం వైకల్యం పరిమాణాన్ని బట్టి 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వలె, ప్రతినెలా మొదటి తేదీన కూటమి నేతలే నేరుగా ఇంటికి వెళ్లి పింఛను అందిస్తున్నామన్నారు. అలాగే దివ్యాంగుల ప్రయాణానికి ఇబ్బంది తలెత్తొద్దు అనే ఉద్దేశంతో ప్రస్తుతం నలుగురు లబ్ధిదారులకు బ్యాటరీతో నడిచే సైకిళ్లను అందిస్తున్నామని బోడే వెంకట్రామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

