9వ వార్డు అభివృద్దే నా ధ్యేయం..

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ,వార్డు అభివృద్ధికై పాటుపడతానని గుర్రం శ్రీనివాస్ అన్నారు.ఎన్నికలలో బాగంగా గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9వ,వార్డులో అభివృద్ధి పనులనేవి గత పాలకుల నిర్లక్ష్యంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందన్నారు.ఈ ఎన్నికలలో తనను కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లను కోరారు.బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే గత పాలకులకు పూర్తి వ్యతిరేకంగా వార్డును అభివృద్ధి చేసి మున్సిపాల్టీలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనపాటు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
