బాసరలో ఏసీబీ తనిఖీలు..

  • ఏసీబీ అదుపులో సీనియర్ అసిస్టెంట్ భీమన్న

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో కలకలం రేగింది. పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భీమన్న కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

తానూర్ పీహెచ్‌సీలో పనిచేస్తున్న సాయిబాబా తన జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్‌టీఏ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు మంజూరు చేయించుకునేందుకు సీనియర్ అసిస్టెంట్ భీమన్న లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడు ఫోన్‌పే ద్వారా రూ.9,000లను భీమన్న ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం.

బాధితుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ మధు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు బాసర పీహెచ్‌సీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమన్న కార్యాలయంలోని సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకొని, సీనియర్ అసిస్టెంట్ భీమన్నను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Leave a Reply