Basket Hall | కవి సమ్మేళనంలో..
- వరంగల్ పంచాంగుల శ్రీధర్ ను సన్మానించిన కమిటీ సభ్యులు
- మున్ముందు మరిన్ని అవార్డులు సాధించారు
Basket Hall | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరానికి చెందిన పంచాంగుల శ్రీధర్ వృత్తి వంటలు చేయడం ప్రవృత్తి సినిమా కథలు, కవితలు, వ్యాసాలు రాయడం పలు సంస్థల్లో సన్మానాలు బహుమతులు తీసుకున్నారు.ఈరోజు సూర్యాపేట జయ భాస్కర బాస్కెట్ హాల్ లో జరిగిన 159వ జాతీయ శతాధిక కవి సమ్మేళనలో కత్తిమండ ప్రతాప్ కవి సమ్మేళనల సూర్యాపేట పేరు మీద కవిత వినిపించినందుకు కత్తిమండ ప్రతాప్, ఈశ్వరి భూషణం పార్థసారథి సాధనలో తెలంగాణ రాష్ట్రం కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు వరంగల్ నగరానికి చెందిన పంచాంగుల శ్రీధర్ కు మెమెంతో సర్టిఫికెట్ అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మున్ముందు ఇలాంటి కవితలు మరిన్ని వినిపించి మరిన్ని అవార్డులు తీసుకోవాలని ఆ సంస్థ వారు కోరారు.

