Basara | వ్యూస్ కోసం చూస్తే కేసులో ఇరుక్కుంటారు
Basara | బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇబ్బందులను కలిగించే వీడియోలు పోస్ట్(Post videos) చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అన్నారు. ఈ రోజు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసరను సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా(social media)లో వచ్చే వీడియోలను నమ్మవద్దనీ, షేర్ చేయొద్దని, సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్(rumors) పట్టించుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరు సమయంనం పాటించి బాసర ప్రశాంతతను కాపాడాలని సూచించారు. అనవసరంగా యువత తమ లైఫ్‌ను స్పాయిల్(spoil life) చేసుకోవద్దని ఎస్పీ కోరారు.
రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలపై ఇరువు వర్గాలపై నాలుగు కేసులు నమోదు చేశామని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో బైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్(SP Avinash Kumar), ముధోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

