ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): స్థానిక రింగ్ సెంటర్‌లోని ఏఎన్ఆర్ బార్ ను భవానీపురం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏఎన్ఆర్ బార్ నిర్వాహకుడు అద్దేపల్లి జనార్ధన్ పై కేసు నమోదు అయింది. జనార్ధన్ ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ నిర్వహిస్తున్నాడు.
ఆదివారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు ఏఎన్ఆర్ బార్‌పై దాడి చేసి స్టాక్‌ను తనిఖీ చేశారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్ధన్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఏఎన్ఆర్ బార్‌ను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ గోపాలకృష్ణ తెలిపారు.