Bapuji | అంద‌రికీ ఆదర్శం

Bapuji | అంద‌రికీ ఆదర్శం

  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

Bapuji | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించేందుకు మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ చేసిన శాంతియుక్త పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, ఆయన చూపిన మార్గంలో న‌డిచి గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీళ పిలుపునిచ్చారు.

జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పెనుగంచిపోలులో జరిగిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అధికారులతో కలిసి పూజ్య బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతి సమగ్రత, సమైక్యతకు బాపూజీ అనుసరించిన శాంతి మార్గం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండినదని, మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హనుమంతరావు, డీఈవో చంద్రకళ, ఐసీడీఎస్ పీడీ రుక్సాన సుల్తానా బేగం, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply