ఖాతా తెరిచేదెవ‌రు…

అబుదాబి : ఆసియా కప్‌లో భాగంగా ఈరోజు గ్రూప్ – బిలోని బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు షేక్ జాయెద్ స్టేడియంలో తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

పిచ్‌పై తేమను ఉపయోగించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో బంగ్లా జ‌ట్టు బరిలోకి దిగింది. బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ విభాగంలో రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్ వంటి ప్రధాన బౌలర్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో లిట్టన్ దాస్, తన్జీద్ హసన్, తౌహిద్ హృదయ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ కీలక పాత్ర పోషించనున్నారు.

మరోవైపు, ఇప్పటికే ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో ఆడి ఓట‌మిపాలైన‌ హాంకాంగ్ జట్టు… పాయింట్ల పట్టికలో నెగటివ్ నెట్ రన్ రేట్‌తో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌తో తమ అయిన ఖాతా తెర‌వాల‌ని వారు ఆశిస్తున్నారు. కెప్టెన్ యాసిమ్ ముర్తాజా నాయకత్వంలో జీషన్ అలీ, అన్షుమన్ రథ్ ఓపెనింగ్ జంటగా బరిలోకి దిగారు. మధ్య ఓవర్లలో బాబర్ హయాత్, నిజకత్ ఖాన్ జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత తీసుకున్నారు. వారి బౌలింగ్ విభాగం కూడా సమతూకంగా ఉంది.

షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉండటంతో, ఇరుజట్ల ప్రదర్శనపై ఆధారపడి ఈ మ్యాచ్ గమ్యం నిర్ణయించబడనుంది.

హాంకాంగ్ జట్టు :

జీషన్ అలీ (వికెట్ కీపర్), అన్షుమన్ రథ్, బాబర్ హయాత్, నిజకత్ ఖాన్, కల్హాన్ మార్క్ చల్లు, కించిత్ షా, యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), ఐజాజ్ ఖాన్, ఇహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, అతీక్ ఇక్బాల్.

బంగ్లాదేశ్ జట్టు :

తంజీద్ హసన్, పర్వేజ్ హొసైన్ ఎమోన్, లిట్టన్ దాస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, షమీమ్ హొసైన్, జాకర్ అలీ, మహెది హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, రిషద్ హొసైన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.

Leave a Reply