Ballot boxes | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Ballot boxes | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

  • మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన బందోబస్తు
  • స్ట్రాంగ్ రూంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి
  • పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • సెక్షన్ 144 నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
  • డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

Ballot boxes | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : ఓటర్లు ఎలాంటి భయం లేకుండా పోలింగ్ రోజున స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయా లని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు ఆదేశిం చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలిం గ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.

పోలింగ్ సామగ్రి పంపిణీ జరుగు తున్న తీరుపై పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌ల భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి పరిశీలించా రు. ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన ముంద స్తు జాగ్రత్తలపై పోలీస్, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశా రు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Ballot boxes |

ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వ హించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నియమాలను ఎవరూ అతిక్రమించకుండా అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం చట్ట విరుద్ధమని, అక్రమ కార్య కలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Ballot boxes |
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తత అవసరం:

పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూంల కు చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమ త్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఎన్నికల బందోబస్తుకు హాజ రయ్యే పోలీస్ సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగిం చుకునేలా పోలీస్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అనంతరం పోలింగ్ కేంద్రాల భద్రతపై స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీం శర్మ, సీఐ జి. వేణును వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల నిబంధనలను కచ్చితం గా అమలు చేయాలని సూచించారు. అనంతరం సీఐ వేణు మాట్లాడు తూ బందోబస్తులో ఒక అడిషనల్ డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐలు వినయ్ కుమార్, నవీన్ కుమార్, నరేష్, ఇతర పోలీస్ సిబ్బం ది పాల్గొన్నారు.

Leave a Reply